నేను రూపాయి పెట్టలేను : ఈటల

ఎన్నికల్లో తాను రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థితిలో లేనని, ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నన్ను చాపను రాకినట్లుగా రాకిండని బీజేపీ పార్టీ హుజూరాబాద్‌, గజ్వేల్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

నేను రూపాయి పెట్టలేను : ఈటల

విధాత: ఎన్నికల్లో తాను రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థితిలో లేనని, ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నన్ను చాపను రాకినట్లుగా రాకిండని బీజేపీ పార్టీ హుజూరాబాద్‌, గజ్వేల్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ నేను ఈ సారి డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేనని, నా వద్ద ధైర్య లక్ష్మి మాత్రమే ఉందన్నారు. కంచె చేను మేసినట్లుగా తెలంగాణను సీఎం కేసీఆర్ దోచుకున్నాడన్నారు. గజ్వేల్ వాసుల భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆవేదన చెందుతున్నాని, వారి ఆవేదరను తీర్చేందుకే తాను గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు వచ్చానన్నారు.