ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీకోసం’: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే పద్మాదేవేంద్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతినెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది. మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, […]

విధాత, మెదక్ బ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే పద్మాదేవేంద్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతినెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది. మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరారు.
మెదక్ పట్టణం 13వ వార్డులోని ప్రజలు వారికి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని స్థానిక కౌన్సిలర్ సులోచన ప్రభు రెడ్డి ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. శ్మశాన వాటిక స్థలం కోసం మెదక్ తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మెదక్ పట్టణంలో కొన్ని వార్డులలో మిషన్ భగీరథ నీళ్ళు తక్కువగా వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్‌ను ఆదేశించారు. పలు సమస్యలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్య లను వివరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ జానకి రామ్ సాగర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.