చేతికర్ర సహాయంతో కేసీఆర్ నడక.. వైరల్‌గా మారిన వీడియో

తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్రమంగా కొలుకుంటున్నారు

చేతికర్ర సహాయంతో కేసీఆర్ నడక.. వైరల్‌గా మారిన వీడియో

విధాత : తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్రమంగా కొలుకుంటున్నారు. ఆయన చేతి కర్ర సహాయంతో నడిచే ప్రయత్నం చేస్తున్న వీడియోను ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ బుధవారం పోస్టు చేయగా, ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రతి అడుగును, దృఢ సంకల్పంతో నమ్మకమైన కర్రతో కొనసాగిస్తూ తిరిగి పూర్వ బలాన్ని పొందుతున్నాడని…ఇదంతా ఆయన మళ్లీ స్వేచ్చగా నడిచేందుకు ముందు సమయం.. ట్యాగ్‌తో ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో కేసీఆర్ గతంలో వాకర్‌తో నడిచిన స్థాయి కంటే కొంత మెరుగ్గా కృత్రిమ చేతి కర్రతో నడుస్తూ కనిపించారు. డాక్టర్ పర్యవేక్షణలో కేసీఆర్ తిరిగి మామూలుగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో తమ అభిమాన నేత తిరిగి తమ మధ్యకు రావాలని ఆశగా ఎదురుచూస్తున్న కేసీఆర్ అభిమానులకు, బీఆరెస్ శ్రేణులకు ఉత్సాహాన్ని కల్గించింది.