కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి.. గద్దర్ కూతురు, తల్లి అభ్యర్థన

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కంటోన్మెంట్‌లో పుట్టి పెరిగిన తాను కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని గద్దర్ కూతురు వెన్నెల స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తనను చాల మంది అడుగుతున్నారని, అందుకే పోటీపై స్పష్టత నిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ కంటోన్మెంట్ టికెట్ ఇచ్చే విషయమై నా పేరు పరిశీలన చేస్తుందన్నారు. గద్దర్ ఆశయ సాధనకు, ఆయన కూతురుగానే ప్రజలకు ముందుకు వస్తున్నానని తెలిపారు.
గద్దర్ భార్య విమల కూడా తన కూతురు పోటీపై స్పందించారు. గద్దర్ ఓట్ల విప్లవం రావాలని అన్నారని, అందుకే తన జీవితంలో చివరిగా కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారన్నారు. కాంగ్రెస్ వాళ్లు తమ కుటుంబానికి టికెట్ ఇస్తామని చెప్పి తరువాత చప్పుడు చేయడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ వాళ్లను తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరారు.