Prabhas: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

Rajasaab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరి పోయే న్యూస్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ టీజర్ డేట్ విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ కీలక అప్డేడ్ ఇచ్చింది. ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. టీజర్ డేట్ ను అనౌన్స్ చేస్తునే సినిమాలోని ప్రభాస్ స్టిల్ తో కూడిన ఓ కొత్త పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ లో ముగ్గురు హీరోయిన్లు మాళివిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు నటిస్తున్నారు.
ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన సినిమా డిసెంబర్ 5కు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ విజువల్స్ కు ప్రాధాన్యత ఉండటం..ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజాసాబ్ సినిమా భారీ హిట్ కొట్టాలని డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.