డైరక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీస్‌లు

డైరక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీస్‌లు

విధాత : టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్ తదితరులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహీల్స్ షేక్ పేటలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలాన్ని రాఘవేంద్రరావు తన సొంత అవసరాలకు వాడుకున్నారని మెదక్ కు చెందిన బాలకిషన్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం విచారణలో భాగంగా నోటీస్‌లు జారీ చేసింది.


ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ. శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో గతంలో జారీ చేసిన నోటీస్‌లు తమ రికార్డులలో లేకపోవడంతో తాజాగా మరోసారి నోటీస్‌లు జారీ చేసి విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. రాఘవేంద్రరావుకు ప్రభుత్వం రాయితీ ధరతో భూమిని కేటాయించగా సంబంధిత స్థలాన్ని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బార్లు, పబ్బులు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.