కాంగ్రెస్‌ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో ముఖ్యాంశాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శుక్రవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన మ్యానిఫెస్టో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే

కాంగ్రెస్‌ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో ముఖ్యాంశాలు

విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శుక్రవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన మ్యానిఫెస్టో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అభయం హస్తం పేరుతో ఇందిరమ్మ రాజ్యం..ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రూపొందించిన 42పేజీల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆరుగ్యారంటీలకు అదనంగా 66 అంశాలను పొందుపరిచారు.


1) తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజస్వామిక పాలన 2) ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు ప్రజాదర్బార్‌ నిర్వహాణ 3) తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమర వీరుల తల్లి/తండ్రి/ భార్యకు 25వేల నెలవారి గౌరవ పెన్షన్‌, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 3) తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు 5) రైతులకు 2లక్షల పంట రుణమాఫీ 6) వడ్డీలేని పంట రుణాలను 3లక్షల వరకు అందచేత 7) వ్యవసాయానికి 24గంటల నిరంతర ఉచిత కరెంట్ 8) అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం 8ఏ) ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సీటీలను రద్దు 9) కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో న్యాయ విచారణ 10) మెగా డీఎస్సీని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6నెలలోనే భర్తీ.

11) వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2లక్షల ఖాళీ పోస్టులను భర్తీ 12) ప్రతి విద్యార్థి, విద్యార్థినిలకు ఫ్రీ (ఇంటర్నెట్‌) వైఫై సౌకర్యం 13) విద్యారంగానికి బడ్జెట్‌లో ప్రస్తుత వాటా 6శాతం నుండి 15శాతం వరకు పెంపు 14) అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికలకు నెలవారి వేతనాన్ని 10వేలకు పెంపు 15) మూతబడిన దాదాపు 6వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభం 16) బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు 17) ఆరోగ్య శ్రీ పథకం పరిమితి 10లక్షలకు పెంచి ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింపు 18) ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్‌ను ప్రవేశ పెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికి న్యాయం 19) ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని భూహక్కుల సమస్యలకు పరిష్కారం 20) భూసంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25లక్షల ఎకరాలపై పూర్తి స్తాయి భూ హక్కులను లబ్ధిదారులకు కల్పించడం.


21) 73,74వ రాజ్యంగ సవరణ ల ప్రకారం మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి నిధులు, విధులు నిర్వాహణ బాధ్యలు అప్పగింత 22) గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు 1500లు, అదే విధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ చెల్లింపు 23) ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికి పెండింగ్‌లో ఉన్న మూడు డిఏలను తక్షణం చెల్లింపు 24) ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్( ఓపీసీ)విధానాన్ని అమలు 25) ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ప్రకటించి 6నెలలోపు సిఫారసులను అమలు 26) ఆర్టీసీ సిబ్బందికి రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లింపు 27)ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి 12వేలు ఆర్ధిక సహాయం 28) పెండింగ్‌లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలను 50శాతం రాయితీతో వనటైమ్ సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరం 29) బెల్ట్ షాపులను పూర్తిగా ధ్వంసం 30) ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా 3ఎస్సీకార్పోరేషన్లు ఏర్పాటు.


31) బీసీల కుల గణన చేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పిస్తాం 32) సంచార జాతతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5శాతం రిజర్వేషన్ కల్పన 33) ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు 34) జనగాం జిల్లాకు సర్థార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు 35) అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పోరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయింపు 36) వెనుక బడిన తరగతులకు బీసీ సబ్ ప్లాన్ అమలు 37) ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు 38) సరిపడా నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు 39) నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే 1లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 10గ్రాముల బంగారం 40) సింగరేణీసంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేయడం.


41) సింగరేణి ప్రవైటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించదు 42) బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్‌ఐ పరిధిలోకి తెస్తాం 43) ప్రమాదశాత్తు చనిపోయే గీత కార్మికులకు 10లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంపు 44) యాదవ, కురుమలకు గొర్రెల పెంపకానికి దళారీలు లేకుండా నేరుగా 2లక్షల సహాయం 45) రాజస్థాన్‌ తరహాలో అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జోమాటో వంటి వారికి సామాజిక భద్రత కల్పన 46) స్వయం సహాయ బృందాలకు పావులా వడ్డీతో రుణ పరిమితి 10లక్షలకు పెంపు 47) పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్ధిక సహాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్దరణ 48) 18సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందచేత 49)అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు 50) సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హైద్రాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరం.


51) మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 5లక్షల నగదు 52) రాష్ట్రంలో ఉన్న ప్రజాపంపిణీ రేషన్ డీలర్లకు 5వేలు గౌరవ వేతనం 53) ఇకపై తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా 54) గల్ప్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు 55) మరణించిన గల్ఫ్‌ కార్మికుని కుటుంబానికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు 56) దివ్యాంగుల నెలవారి పెన్షన్ ఇక నుంచి 6వేల పెంపు 57) ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్‌ ఏర్పాటు 58)హోంగార్డుల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం 59) నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకవచ్చి, చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు 60) అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18వేలుకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను కల్పన.


61) 50సంవత్సరాలు దాటిన జానపద కళకారులకు నెలకు 3వేలు పెన్షన్ చెల్లింపు 62) ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్‌గా గుర్తించి పూర్తి స్తాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకరావడం 63) ఎల్బీ నగర్‌-ఆరాంఘర్‌-మోహిదీ పట్నం-బీహెచ్‌ఈఎల్ రూట్లలో కొత్త మెట్రోల నిర్మాణం 64) హైద్రాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునీకరణ చేపట్టడం 65) రాష్ట్ర పురపాలక సంఘాలు, కార్పోరేషన్లు, గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై ఉన్న ఫెనాల్టీల రద్దు 66) నగర పాలక, మున్సిపాల్టీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు .


ఆరు గ్యారంటీలు


1) మహాలక్ష్మి- మహిళలకు ప్రతినెల 2500రూపాయలు, 500లకే గ్యాస్ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2) రైతు భరోసా ప్రతి ఏటా-రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు, వరి పంటకు 500బోనస్ 3) గృహ జ్యోతి – ప్రతి కుటుంబానికి 200యూనిట్ల ఉచిత విద్యుత్తు 4) ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5లక్షలు, ఉద్యమకారులకు 250గజాల ఇంటి స్థలం, 5) యువ వికాసం-విద్యార్థులకు 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ 6) చేయూత- నెలవారి 4వేల పెన్షన్‌, 10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా.