School Holidays | జులై 21న పాఠ‌శాల‌ల‌కు సెల‌వు.. ఎందుకో తెలుసా..?

School Holidays | విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులకు శుభ‌వార్త‌. ఈ నెల 21వ తేదీన హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు( Schools ) ప్ర‌భుత్వం సెల‌వు( Holiday ) ప్ర‌క‌టించింది.

School Holidays | జులై 21న పాఠ‌శాల‌ల‌కు సెల‌వు.. ఎందుకో తెలుసా..?

School Holidays | హైద‌రాబాద్ : విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులకు శుభ‌వార్త‌. ఈ నెల 21వ తేదీన హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు( Schools ) ప్ర‌భుత్వం సెల‌వు( Holiday ) ప్ర‌క‌టించింది. ఎందుకంటే బోనాల పండుగ( Bonalu Festival ) నేప‌థ్యంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ప్ర‌తి ఏడాది బోనాల పండుగ మ‌రుస‌టి రోజున ప్ర‌భుత్వం అధికారికంగా సెల‌వు ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి ఏడాది ఆషాఢ మాసం( Ashadha Masam )లో బోనాల జాత‌ర జ‌రుగుతుంది. ఇప్ప‌టికే గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ మ‌హంకాళి బోనాల పండుగ ముగిసింది. ఇక మిగిలింది పాత‌బ‌స్తీ లాల్‌ద‌ర్వాజ బోనాలు( Lal Darwaja Bonalu ). లాల్ ద‌ర్వాజ బోనాలు ఈ నెల 20వ తేదీన జ‌ర‌గ‌నుంది. 21న సెల‌వు ప్ర‌క‌టించారు. లాల్ ద‌ర్వాజ బోనాల‌కు పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన 2025 సెలవుల జాబితా ప్ర‌కారం.. జులై 21న అప్ష‌న‌ల్ హాలిడే కాకుండా జ‌న‌ర‌ల్ హాలిడేగా ప్ర‌క‌టించింది. ఇక ద‌స‌రా సెల‌వులు( Dasara Holidays ) సెప్టెంబ‌ర్ 21 నుంచి అక్టోబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు, క్రిస్మ‌స్ సెల‌వులు డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు, సంక్రాంతి సెల‌వులు( Sankranthi Holidays ) 2026 జ‌న‌వ‌రి 11 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌క‌టించారు.