Khammam | ఖమ్మంలో కోటిన్నర నగదు పట్టివేత
ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఇన్నోవా కారు ఫల్టీ కొట్టగా అందులో కోటిన్నర నగదు పట్టుబడింది.

10కిలోమీటర్లు చేజింగ్..ఇన్నోవా ఫల్టీ
విధాత : ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఇన్నోవా కారు ఫల్టీ కొట్టగా అందులో కోటిన్నర నగదు పట్టుబడింది. నాయకన్నగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇన్నోవా కారులో నగదు తరలిస్తున్న వ్యక్తులు కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇన్నోవా కారును వెంటాడి పది కిలోమీటర్ల చేజింగ్ చేశారు.
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇన్నోవా కారు అదుపు తప్పి మూడు ఫల్టీలు కొట్టింది. చివరకు అందులోని వారు, నగదుతో పాటు పోలీసులకు పట్టుబడ్డారు. కారులోని రెండు బ్యాగుల్లో సుమారు కోటిన్న నగటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో పంపిణీ కోసమే ఆ డబ్బును తరలిస్తున్నారని, అయితే ఆ నగదు ఎవరిది..ఎక్కడి నుంచి ఎవరికోసం తీసుకెలుతున్నారన్నదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.