జనసేనకు 8 సీట్లు.. బీజేపీ చాణక్యం

జనసేనకు 8 సీట్లు.. బీజేపీ చాణక్యం
  • పట్టు లేని స్థానాలే జనసేనకు


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తనకు అంతగా పట్టులేని స్థానాలను జనసేనకు కేటాయించి తన చాణక్యం ప్రదర్శించింది. సెటిలర్ల ఓట్లు ఎక్కువగా, తమ పార్టీకి తక్కువగా ఓట్లు ఉన్న 8 స్థానాలను జనసేనకు బీజేపీ కేటాయించింది. వాటిలో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, తాండూర్, కోదాడ, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి స్థానాలున్నాయి.


ఈ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే అదే విషయం తేటతెల్లమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీకి 2,325 ఓట్లు, వైరాలో 1025 ఓట్లు, కొత్తగూడెంలో 1466 ఓట్లు, అశ్వారావుపేటలో 1303, తాండూర్‌లో 10548 ఓట్లు, కోదాడలో 1485 ఓట్లు, నాగర కర్నూల్‌లో 3923ఓట్లు, కూకట్ పల్లిలో 11943ఓట్లు పోలవ్వడం గమనార్హం.