హైదరాబాద్-మాల్దీవ్స్ కు ఇండిగో విమాన సేవలు

విధాత: హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య విమాన సేవలను ఇండిగో సంస్థ మంగళవారం తిరిగి ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.