జంట జలాశయాలకు జలకళ

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ముసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జంట జలాశయాలకు జలకళ

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలోని జలాశయాలు వరద నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. జంట నగరాల్లోని జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 1783.10 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 1763.10 అడుగులకు చేరింది.
దీంతో హిమాయత్ సాగర్‌ నుంచి నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో2,500క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నీటి విడుదల నేపథ్యంలో దిగువన మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read more- Rain Alert : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

గ్రేట్ జంప్.. 31మీటర్ల ఎత్తైన వంతెన మీదుగా లోయలోకి జంపింగ్!