Saraswati Nadi Pushkaralu 2025 | సరస్వతి నది పుష్కరాలకు ముస్తాబైన కాళేశ్వరం.. రూట్ మ్యాప్ ఇదే..!
Saraswati Nadi Pushkaralu 2025 | 12 ఏండ్లకు ఒకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలు( Saraswati Nadi Pushkaralu 2025 ) మే 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణ( Telangana )లోని కాళేశ్వరం( Kaleshwaram ) త్రివేణి సంగమం( Triveni Sangamam ) ముస్తాబైంది. అక్కడ పుష్కర ఘాట్లు( Pushkara Ghats ), వసతి, బస్సు, రైళ్ల సౌకర్యాల వంటి వివరాలు తెలుసుకుందాం..

Saraswati Nadi Pushkaralu 2025 | ఏడాదికి ఓ నదికి చొప్పున మొత్తం 12 నదలుకు 12 సంవత్సరాలకు ఓసారి పుష్కరాలొస్తాయి. 2025 సంవత్సరంలో సరస్వతి నదికి పుష్కరాలు( Saraswati Nadi Pushkaralu 2025 )వచ్చాయి. మే 15వ తేదీన బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే సరస్వతీ నదీ( Saraswathi River ) ఎక్కడా కూడా ప్రత్యేకంగా ప్రవహిస్తూ కనిపిందు. అంతర్వాహినిగా ఉంటుంది.
తెలంగాణ( Telangana )లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం( Kaleshwaram ) త్రివేణి సంగమం( Triveni Sangamam ) వద్ద ప్రవహించే “అంతర్వాహిని” సరస్వతీ నదీ పుష్కరాలకు ముస్తాబైంది. త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం. ఇక్కడ పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. పుష్కరాల సమయంలో, చాలా మంది భక్తులు కాళేశ్వరంను సందర్శించి, నదిలో స్నానమాచరించి, ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు, వేద జపాల్లో పాల్గొంటారు. జ్ఞాన హోమాలు, విద్యా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
మరి కాళేశ్వరం ఎలా వెళ్లాలి.. బస్సు, రైలు సౌకర్యాలు ఏంటి..? అక్కడ పుష్కర ఘాట్ల వివరాలు ఏంటి..? బస చేసేందుకు వసతి సౌకర్యాలు ఉన్నాయా..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రత్యేక బస్సులు( RTC Buses )
సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విజయవాడ నుంచి కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు మే 14 నుంచి 26వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. టికెట్ ధరలను హైదరాబాద్ నుంచి రూ. 443(సూపర్ లగ్జరీ), విజయవాడ నుంచి రూ. 559(డీలక్స్) గా నిర్ణయించారు.
ప్రత్యేక రైళ్లు..( Special Trains )
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. మే 15 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. విజయవాడ నుంచి మంచిర్యాలకు రూ. 300గా టికెట్ ధర నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు రూ. 400గా నిర్ణయించారు.
హోటల్స్ వివరాలు ఇవే..
హరిత హోటల్(9951239018)
శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వసతి గృహం(9121590439)
సింగరేణి గెస్ట్ హౌజ్(9121590439)
త్రివేణి వసతి గృహం(9121590439)
టెంట్ హౌజ్ – నాన్ ఏసీ(9887745463)
టెంట్ హౌజ్ ఏసీ(9887745463)
పుష్కర ఘాట్లు ఇవే..( Pushkara Ghats )
గోదావరి ఘాట్(వీఐపీ ఘాట్)
ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు
సరస్వతి ఘాట్ త్రివేణి సంగం
ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు
సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన వెబ్‌సైట్ ఇదే.. https://saraswatipushkaralu.com/