SI Bhawani Sen | కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్‌ఐ అరెస్టు.. 14రోజుల రిమాండ్‌

తోటి పోలీస్ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్‌ఐ భవానీసేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడంతో బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది

SI Bhawani Sen | కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్‌ఐ అరెస్టు.. 14రోజుల రిమాండ్‌

విధాత : తోటి పోలీస్ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్‌ఐ భవానీసేన్‌ను ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ను లైంగిక దాడికి పాల్పడటంతో పాటు విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ తుపాకితో బెదిరించి భవానీసేన్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు తొలుత అతడిని సస్పెండ్ చేసి, సర్వీస్ రివాల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్డులో హాజరుపరుచగా కోర్టు భవానీసేన్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం అర్ధరాత్రి డీఎస్పీ బృందం కాళేశ్వరం ఠాణాలో విచారణ చేపట్టారు.

అర్ధరాత్రి దాటాక విచారణ ముగియడంతో ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా ప్రైవేటు వెహికల్‌లో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ భవానీ సేన్ పై లైంగికదాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కాగా, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శీనుబాబు అండతో ఎస్ఐ రెచ్చిపోతూ పలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని చేసిన ప్రతి చోటా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం భవానీసేన్ అరాచకాలకు నిదర్శనంగా నిలిచింది. గతంలో అసిఫాబాద్ రెబ్బన ఎస్‌ఐగా ఉన్న సమయంలో కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో భవానిసేన్ సస్పెండ్ కూడా అయ్యాడు. అలాగే మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్‌ను సైతం అతను వేధించినట్లుగా ఆరోపణలున్నాయి.