ధాన్యం కొనుగోలులో కేసీఆర్ దుష్ప్రచారం: మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ
విధాత: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఘనత అన్నట్లుగా సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రం మద్దతు ధర అమలుకు తగిన నిధులు కేటాయించితేనే రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేస్తూ తామే కొనుగోలు చేస్తున్నట్లుగా రైతులను మభ్యపెడుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. సోమవారం నల్గొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం దాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేసి కేంద్రంపై బురద చల్లే […]

విధాత: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఘనత అన్నట్లుగా సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రం మద్దతు ధర అమలుకు తగిన నిధులు కేటాయించితేనే రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేస్తూ తామే కొనుగోలు చేస్తున్నట్లుగా రైతులను మభ్యపెడుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు.
సోమవారం నల్గొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం దాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేసి కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేశారని, ఈ సీజన్‌లో కేంద్రం చొరవతో యధావిధిగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారని ఆరోపించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గొల్ల కురుమలకు గొర్రెల స్కీం డబ్బులు కేంద్రం కారణంగా నిలిచిపోయాయని చెప్పి తప్పుడు ప్రచారం చేశారని ఎన్నికల అవసరం తీరాక మళ్ళీ గొర్రెలు పంపిణీ చేస్తామంటూ మాటలు మార్చారని విమర్శించారు. అదే రీతిలో ధాన్యం కొనుగోలులో సైతం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతూ రైతులని మోసం చేస్తున్నారన్నారు.
రైతుల కోసం సబ్సిడీ ద్వారా రూ. రెండు లక్షల ఇరవై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించి రైతులకు ఎరువులను కొరత లేకుండా కేంద్రం ఇస్తుందన్నారు. గతంలో అమలైన సబ్సిడీ విత్తనాలు, తోటల సబ్సిడి, సబ్సిడీ పని యంత్రాల పథకాలను కేసీఆర్ ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు
కౌలు రైతులకు అన్యాయం చేస్తు రైతుబంధు పథకాలతో రైతుల కంటే భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎక్కువ లబ్ధి చేకూరుస్తుందని విమర్శించారు. ఇకనైనా సీఎం కేసీఆర్ ప్రభుత్వం
సొంత డబ్బాలు కొట్టుకోకుండ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతు రుణమాఫీ, పంట నష్టం పరిహారం పథకాలు అమలు చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి , వీరెల్లి చంద్ర శేఖర్, పల్లె బోయిన శ్యామ్ సుందర్, చలమల సీత రాం రెడ్డి, పడమటి జగన్ మోహన్ రెడ్డి , పాలకూరి ఎలంద్ర గౌడ్, వెంకట్ రెడ్డి, యాదగిరా చారి, బగవంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..