రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

విధాత : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చ జరిగింది. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై మూడు రోజుల్లోగా స్పష్టతనివ్వనున్నట్లు తెలిపారు.