కోమటిరెడ్డితోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యం: సబిత

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తే నల్గొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కోమటిరెడ్డి సబిత వెంకట్ రెడ్డి అన్నారు

కోమటిరెడ్డితోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యం:  సబిత
  • వెంకట్ రెడ్డి సతీమణి సబిత
  • 10వ వార్డులో ఇంటింటి ప్రచారం


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తే నల్గొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కోమటిరెడ్డి సబిత వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబిత వెంకట్ రెడ్డి శుక్రవారం నల్లగొండ పట్టణంలోని 10వ వార్డు నీలగిరి కాలనీ, కనకదుర్గ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేద ప్రజల మనిషిని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా నిరంతరం వారి సంక్షేమం కోసం పాటుపడతారని తెలిపారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని ఆనాడు త్యాగం చేశాడని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న హయాంలోనే ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు.


కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఈఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, కౌన్సిలర్లు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, గుమ్మల జానకి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నరసింహ, అబ్బగోని కవిత, కేసాని కవిత, వంగాల సుమతి, ఎగ్గడి సుజాత, ఆంగోతు మాధవి, నాగమణి రెడ్డి, షహనాజ్ పర్వీన్, కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, రుద్రాక్ష వెంకన్న, తిరుగుడు రాంరెడ్డి, తేలుకుంట్ల సంజీవరెడ్డి, సుధాకర్ రావు, యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.