చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు

చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్‌రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషాలాడరంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు
  • మాజీ ఎంపీ కొండా ఫిర్యాదుతో కేసు

విధాత : చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్‌రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషాలాడరంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 20వ తేదీన బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్‌లో చేశారు. కొండా ఫిర్యాదు మేరకు కోర్టు అనుమతితో పోలీసులు బుధవారం రంజిత్‌రెడ్డిపై 504సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చేవేళ్ల నుంచి రంజిత్‌రెడ్డి బీఆరెస్ అభ్యర్థిగా, కొండా బీజేపీ అభ్యర్థిగా పోటీ పడనున్న నేపథ్యంలో వారి మధ్య ముందస్తుగానే పోలీసు కేసుల లొల్లి నెలకొనడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొండాకు ఫోన్ చేసిన రంజిత్‌రెడ్డి తన మనుషులను ఎలా కలుస్తావని ఫోన్‌లో ప్రశ్నించారు. దమ్ముంటే నీ మనుషులను నీవు తీసుకెళ్లాలని కొండా బదులిచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ వివాదంలో రంజిత్‌రెడ్డి తనను దుర్భాషలాడారని కొండా పోలీసు కేసు పెట్టారు.