Malla Reddy | సీఎం అపాయిమెంట్ ఖరారు.. అన్ని విషయాలు వివరిస్తా: మల్లారెడ్డి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రలోని ఓ భూమి వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కు మధ్య నెలకొన్న భూవివాదం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి

విధాత, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రలోని ఓ భూమి వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కు మధ్య నెలకొన్న భూవివాదం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫామ్ అయిందని, ఈ వ్యవహారంలో అన్ని విషయాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మల్లారెడ్డి తెలిపారు.
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలతో, పోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపుతూ తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. తన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే మల్లారెడ్డి తన వద్ద ఉన్న డాక్యుమెంటు ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని లక్ష్మణ్‌కు సవాల్ చేశారు. అయితే ఈ భూ వివాదంలో అటు లక్ష్మణ్ కూడా తమవైపే న్యాయముందంటూ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలవబోతుండటం ఆసక్తికరంగా మారింది.