మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఏది చేసినా, ఏది మాట్లాడినా కూడా సంచ‌ల‌న‌మే. అంతేకాదు ఆయ‌న మాట‌ల‌కు జ‌నాలు ప‌డిప‌డి న‌వ్వుతుంటారు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఏది చేసినా, ఏది మాట్లాడినా కూడా సంచ‌ల‌న‌మే. అంతేకాదు ఆయ‌న మాట‌ల‌కు జ‌నాలు ప‌డిప‌డి న‌వ్వుతుంటారు. శాస‌న‌స‌భ‌లోనూ ఆయ‌న మైక్ అందుకున్నారంటే.. మిగ‌తా ఎమ్మెల్యేల ముఖాలు వెలిగిపోతుంటాయి. ఎందుకంటే.. ఆయ‌న మాట‌లు న‌వ్వు తెప్పించేంతగా ఉంటాయి. సీరియ‌స్ స‌బ్జెక్ట్‌ను కూడా చాలా సింపుల్‌గా చెప్పేస్తూ అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు మ‌ల్లారెడ్డి.

అయితే సోమ‌వారం కూడా శాస‌న‌స‌భ‌లో మల్లారెడ్డి మాట్లాడారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను ఓ రిక్వెస్ట్ చేశారు. నాదేం లేదు.. ఒక్క‌టే నిమిషం.. ఒక్క‌టే సెకండ్. ఒక రిక్వెస్ట్ చేస్తున్నా.. 14, 15 తేదీల్లో వ‌సంత పంచ‌మి ఉంది కాబ‌ట్టి.. 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి. కాబట్టి స‌భ్యులంద‌రి కోరిక మేర‌కు ఆ రెండు దినాలు స‌భ పెట్టొద్ద‌ని మా రిక్వెస్ట్ అని కోరుతూ త‌న ప్ర‌సంగాన్ని ముగించేశారు మ‌ల్లారెడ్డి. మ‌ల్లారెడ్డి రిక్వెస్ట్‌ను చూసి స‌భాప‌తితో పాటు స‌భ్యులు కూడా న‌వ్వారు.

Somu

Somu

Next Story