చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

విధాత, హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రత్యేకంగా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారంటూ పరోక్షంగా రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తన కుమారుడు భద్రారెడ్డికే మల్కాజిగిరి బీఆరెస్ ఎంపీ టికెట్ ఖాయమైందన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, కేసీఆర్ కుటుంబంలో మాదిరిగా నా కుటుంబంలోనూ ముగ్గురు పోటీ చేస్తే తప్పేంటంటూ ప్రశ్నించారు. మల్లారెడ్డి పూటకో తీరుగా చేస్తున్న వ్యాఖ్యలపై బీఆరెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

Subbu

Subbu

Next Story