జంగా దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలువు: మర్రి యాదవరెడ్డి

- కాంగ్రెస్ కుమ్ములాటలకు మేమా కారణం
- మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్‌కు క్షమాపణ చెప్పాలి
- బీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దమ్ముంటే నీ పార్టీలో టికెట్ తెచ్చుకో, లేకపోతే ఇండిపెండెంట్ గా నైనా పోటీలో నిలబడి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డికి బీఆరెఎస్ నేత, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్ రెడ్డి, జంగాకు మధ్య ఉన్న గొడవల్లో మంత్రి, చీఫ్ విప్ ను లాగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డి మనుషులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రాఘవరెడ్డిపై పెట్టించాడనడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో బీఆరెస్ కు, మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఓటమి ఎరుగని నాయకులపై జంగా చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు.
2018 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చీకొడితే జనగామకు పారిపోయి వచ్చావన్నారు. జనగామ నుండి మళ్లీ పశ్చిమ నియోజకవర్గం వచ్చి అల్లర్లు సృష్టించి, అశాంతి నెలకొల్పి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న జంగాకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం రూ.5500 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత చీప్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్ దని అన్నారు.
జంగాపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బీఆరెస్ కు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారావని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ డైరెక్టర్ గుర్రాల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రెంటాల కేశవ రెడ్డి, కోయగూర వెంకటరంగా రెడ్డి, సుగుణాకార్ రెడ్డి, చాడా నేపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, పెండ్యాల శ్వేతా రెడ్డి, నల్ల సుధాకర్ రెడ్డి, తుమ్మేటి జయపాల్ రెడ్డి, వెలపాటి హేమ్ సుందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.