రేవంత్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి హరీశ్ రావు

విధాత : ఓటుకు నోటు కేసులో నిందితుడైన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భవిష్యత్తులో ఎప్పుడైన జైలుకెళ్లక తప్పదని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లో బీఆరెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ తనను విచారించవద్దంటూ వేసిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, విచారణ జరుగాల్సిందేనని తేల్చి చెప్పాయన్నారు.
కాగా.. రెండు కోర్టుల్లోనూ ఎక్కడా ఆయనకు ఊరట దక్కలేదని, తప్పు చేసినందునా విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం స్పష్టం చేసిందన్నారు. తప్పు చేసినందుకు విచారణ ఖాయమని, జైలుకెళ్లడం అంతకన్నా ఖాయమని, ఈ కేసులో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం తప్పదన్నారు.