Minister Komatireddy | దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు: మంత్రి కోమటిరెడ్డి
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి తక్షణ మరమ్మతులు జరిపించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

విధాత: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి తక్షణ మరమ్మతులు జరిపించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్ల పరిస్థితులపై శుక్రవారం సచివాలయంలో నేషనల్ హైవే, గ్రేటర్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన, గ్రేటర్ హైదరాబాద్ రోడ్లకు సంబంధించిన మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
పెండింగ్ ఫ్లై వోవర్ల నిర్మాణం..వర్షాలకు రోడ్లపై ఎక్కడెక్కడ వరద నీరు చేరుతుందన్న అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. నీటి వనరుల పక్క నుంచే సాగే రోడ్లు, వరద నీరు వచ్చే రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు. విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇతర జాతీయ రహదారులు, ఆర్‌ఆండ్‌బీ రోడ్లపై కూడా పర్యవేక్షణ చేసి మరమ్మతులపై దృష్టి సారించాలని ఆదేశించారు.