Pushpa 2 Victim । పర్మిషన్ లేకుండా సినిమా వాళ్లు బయటకు రావద్దన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి తేజ్ తండ్రికి రూ. 25 లక్షల చెక్ ను అందించారు.

Pushpa 2 Victim । కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి తేజ్ తండ్రికి రూ. 25 లక్షల చెక్ ను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక పై తెలంగాణలో బెన్ ఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అవేమైన దేశ భక్తికి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? అని అడిగారు. మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాల విషయం వేరు అని అన్నారు. పుష్ప 2 నేను కూడా చూశాను అని చెప్పారు.మూడు గంటల సినిమా సమయంలో చాల పనులు చేసుకోవచ్చునన్నారు.
మేం కూడా క్షమాపణ చెప్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సినిమాలతో యువత చెడిపోతుందన్నారు.
సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దన్నారు. షోలు చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావొద్దన్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, అందరూ హీరోలు, ప్రొడ్యూసర్స్ కోపరెట్ చేయాలని కోరారు.
|