Minister Sridhar Babu | నీట్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

నీట్ పరీక్షలు..ఫలితాలలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించి బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకుని నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి డి. శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు

Minister Sridhar Babu | నీట్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

బొగ్గు గనుల బ్లాక్‌లను ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వహించాలి
త్వరలో జాబ్ క్యాలెండర్‌
మంత్రి డి. శ్రీధర్‌బాబు డిమాండ్‌

విధాత, హైదరాబాద్‌ : నీట్ పరీక్షలు..ఫలితాలలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించి బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకుని నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి డి. శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్డీఏ సర్కార్ దారుణంగా ఫెయిల్ అయిందన్నారు. నీట్ పై నమ్మకం కల్పించేలా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు.

తెలంగాణ సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తుందని, కార్మికుల నైపుణ్యం వల్ల అది బలంగా ఉందని, మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే బొగ్గు బ్లాక్‌లు నిర్వహించాలన్నారు. కేంద్రం మాత్రం ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాక్‌లు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారన్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని సూచించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకచేతితో బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయమని అంటునే..మరోవైపు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పనిలో కేంద్ర సర్కార్ ఉందన్నారు శ్రీధర్ బాబు. ఈ వ్యవహారంలో కేంద్రం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దీనిపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతారని, శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించిన చర్యలు తప్పవన్నారు. బీఆరెస్ పాలకులు తమ ప్రభుత్వంపై నిత్యం లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, గతంలో వారి పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను పునారాలోచన చేసుకుంటే వచ్చే ఎన్నికల్లోనైనా ఆ పార్టీకి ఒక్క సీటు రావచ్చన్నారు. తెలంగాణ ప్రజల కోసం తాము పరిపాలన చేస్తాం తప్ప ఏపీ ప్రభుత్వం నుండి తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. జీవో 46పై మంత్రివర్గం ఉప సంఘం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. గ్రూప్ 1,2,3పోస్టుల భర్తీలో వివాదం రాకుండా ప్రస్తుతం పద్దతిలోనే పరీక్షల నిర్వాహణ పూర్తి చేస్తామని, తదుపరి కొత్త పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.