ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ పిటిషన్ విచారణ 27కు వాయిదా

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ పిటిషన్ విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ పిటిషన్ విచారణ 27కు వాయిదా

విధాత : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ పిటిషన్ విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఉమా మహేశ్వరరావు ను ఏసీబీ విచారణ నిమిత్తం వారం రోజుల పాటు కస్టడీ కోరింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన నాంపల్లి ఏసీబీ కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారంకు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావుకు ఏసీబీ కోర్టు ఇప్పటికే 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం ఉమా మహేశ్వర్ రావు చంచల్ గూడ జైల్లో ఉన్నారు.