బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించండి: నందారెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించండి: నందారెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఆర్మూర్ బీజేపీ ఇంచార్జి నందా రెడ్డి పిలుపునిచ్చారు. హావేలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి, వాడి, కొత్తపల్లి గ్రామాల్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.


పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ టికెట్ ఎవరికిచ్చినా కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రంజిత్ రెడ్డి, నాయకులు బాబా గౌడ్, నర్సింహులు, ప్రభాకర్, నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.