బీఎస్పీలో చేరిన నీలం మధు ముదిరాజ్

- నేడు నామినేషన్ దాఖలు
విధాత : పటాన్ చెరు నియోజకవర్గం రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. బీఆరెస్ టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్‌గౌడ్ అసమ్మతి వ్యక్తం చేయడంతో మధు టికెట్‌ను రద్ధు చేసి శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించారు.
కాంగ్రెస్ నిర్ణయంతో ఖంగుతిన్న నీలం మధు ముదిరాజ్ శుక్రవారం అనూహ్యంగా బీఎస్పీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కండువా కప్పి నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించి పటాన్ చెరు అభ్యర్థిగా ప్రకటించారు. ఆ వెంటనే నీలం మధు పటాన్ చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన అభిమానులు, మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేసేందుకు బయలు దేరారు.