గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని: జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో గట్టి పోటీ ఉన్నదని గెలిస్తే అర్జుడిని, ఓడితే అభిమన్యుడిని అవుతానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని: జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ, నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి

విధాత : నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో గట్టి పోటీ ఉన్నదని గెలిస్తే అర్జుడిని, ఓడితే అభిమన్యుడిని అవుతానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ గెలువకుండా బీఆరెస్‌ పోలింగ్‌ రోజు బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. అయినా ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందునే బీఆరెస్‌ రైతు దీక్షలు చేపడుతున్నదని ఎద్దేవా చేశారు. బీఆరెస్‌ రైతు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉండటమే కాకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదన్నారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా వరి వేస్తే ఉరి, కేవలం సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలన్నారని గుర్తు చేశారు. అలాంటి ఆయన రైతు దీక్షలకు పిలుపు నివ్వడం తనకు ఆశ్చర్యం వేసిందని జీవన్‌రెడ్డి అన్నారు. గతంలో మీరు అమలు చేసిన పని మేము చేయకుంటే తప్పన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిన్నటిదాకా అమలు చేసిన కార్యక్రమాలను అమలు చేస్తూనే అదనంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన జగిత్యాలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నిజామాబాద్‌లో పోటీ చేశానని తెలిపారు. గెలిస్తే అర్జునుడి అవుతా ఓడిపోతే అభిమన్యుడిని అవుతానని జీవన్‌రెడ్డి చెప్పారు.