ప్రభుత్వ భూములను ఎవరూ కొనవద్దు: భట్టి
విధాత,హైదరాబాద్: ప్రభుత్వ భూములను విక్రయించాలనే తెరాస ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. సీఎల్పీ అత్యవసర సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఉద్యమం చేస్తామన్నారు. తెచ్చిన అప్పులను లెక్కలు లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే అమ్మిన భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ భూములను కొనవద్దని కోరారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెరాస […]

విధాత,హైదరాబాద్: ప్రభుత్వ భూములను విక్రయించాలనే తెరాస ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. సీఎల్పీ అత్యవసర సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఉద్యమం చేస్తామన్నారు. తెచ్చిన అప్పులను లెక్కలు లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే అమ్మిన భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ భూములను కొనవద్దని కోరారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెరాస అమ్మిన భూములను తిరిగి తీసుకంటామని భట్టి విక్రమార్క తెలిపారు.