జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి..

ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు విధాత‌: తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌న్నారు. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్ర‌భుత్వం బాగా స‌హ‌క‌రిస్తోంది. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని ఆదేశించారు. గ్రామాల్లో ప్ర‌తి ఇంటికి […]

జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి..

ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు

విధాత‌: తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌న్నారు. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్ర‌భుత్వం బాగా స‌హ‌క‌రిస్తోంది. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని ఆదేశించారు. గ్రామాల్లో ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు ఇచ్చి నాటించాలి. ఎన్న‌డూ లేని విధంగా పంట‌ల‌తో రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి అద‌న‌పు రైస్ మిల్లులు అవ‌స‌రం ఉంద‌న్నారు. రైస్ మిల్లుల సంఖ్య‌ను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.