సూర్యాపేటలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

విధాత, స్యూర్యాపేట: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో జిల్లా పోలీస్, పారా మిలిటరీ సిబ్బంది కవాతు నిర్వహించారు. పౌరులు ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ నాగభూషణం, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజేష్, మహేష్, సీఐలు రాజశేఖర్, అశోక్ రెడ్డి, సర్కిల్ ఎస్ఐలు పాల్గొన్నారు.