7న తెలంగాణకు మోడీ రాక

7న తెలంగాణకు మోడీ రాక
  • బీసీ సభకు హాజరు
  • ఆసక్తిరేపుతోన్న ప్రధాని పర్యటన
  • 11న మాదిగల విశ్వరూప సభకు హాజరు


విధాత : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 7వ తేదీన హైద్రాబాద్‌కు రానున్నారు. ఎల్భీనగర్ స్టేడియంలో అదే రోజు సాయంత్రం బీజేపీ నిర్వహించే ఓబీసీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రధాని తాను హాజరుకానున్న ఓబీసీ సభలో బీజేపీ బీసీ సీఎం అభ్యర్ధి ఎవరన్నదానిపై ప్రకటన చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, కేంద్ర డ్యాం సెఫ్టీ ఆథార్టీ కమిటీ ప్రాజెక్టు నిర్మాణ లోపాలను తప్పుబట్టిన నేపధ్యంలో ప్రధాని ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఆసక్తి రేపుతోంది. కాగా ప్రధాని నరేంద్రమోడీ తదుపరి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 11న హైద్రాబాద్‌లో జరిగే మాదిగల విశ్వరూప మహా సభలో కూడా పాల్గొననున్నారు. ఓబీసీల సభలో ఓబీసీలకు బీజేపీ చేసిన మేలుతో పాటు, మాదిగల విశ్వరూపం మహాసభలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మాదిగలకు భరోసా కల్పిస్తారని, వారిలో ఉన్న అపోహలను తొలగిస్తారని తెలంగాణ బీజేపీ ప్రకటింది.