మెదక్ DEOగా రాధా కిషన్.. బాధ్యతలు స్వీకరణ

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా విద్యాధికారిగా రాధాకిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన శనివారం ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్లా జిల్లా విద్యాధికారిగా ఉన్న ఆయన మాజీ డీఈవో రమేష్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ను కలసి పుష్ప గుచ్చం అందించారు. నూతన డీఈవోకు అభినందనలు విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రధాకిషన్‌ను పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, మండల విద్యాధికారులు సన్మానించారు. prtu […]

మెదక్ DEOగా రాధా కిషన్.. బాధ్యతలు స్వీకరణ

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా విద్యాధికారిగా రాధాకిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన శనివారం ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్లా జిల్లా విద్యాధికారిగా ఉన్న ఆయన మాజీ డీఈవో రమేష్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ను కలసి పుష్ప గుచ్చం అందించారు.

నూతన డీఈవోకు అభినందనలు

విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రధాకిషన్‌ను పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, మండల విద్యాధికారులు సన్మానించారు. prtu మెదక్ జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి కృష్ణ, పత్రిక సంపాదక వర్గ సభ్యులు అంతమ్మ గారి వెంకట్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల సురేందర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు బత్తుల ఆశయ్య, రవి, సతీష్ గౌడ్, శిరిగ చంద్ర శేఖర్, ఇమ్మడి సంతోష్ కుమార్ అజయ్ గౌడ్, మండల విద్యాధికారులు నీలకంఠం యాదగిరి జిల్లా గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సుదర్శనమూర్తి సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు రాధా కిషన్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా నూతన డీఈవో రాధా కిషన్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతానని అన్నారు. ఎస్సెస్సీ పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెడుతానని, జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.