విధాత : అధికార బీఆరెస్ పార్టీని రోడ్డు రోలర్‌, చపాతి మేకర్ గుర్తులు భయపెడుతున్నాయి. పోటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఆ గుర్తులను కేటాయించడంతో అధికార పార్టీ అభ్యర్థులను భయపెడుతుంది. ఆ గుర్తులు కేటాయించవద్దని బీఆరెస్ లీగల్ సెల్ ఎన్నికల సంఘం వద్ద, సుప్రీంకోర్టులో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓటర్లు గుర్తులను గుర్తించలేనంతా అమాయకులు కారంటూ సుప్రీం ఘాటుగానే వ్యాఖ్యానించింది. అయితే గత 2018, 2019పార్లమెంటు ఎన్నికల్లో, పలు ఉప ఎన్నికల్లో కారు గుర్తు పోలిన ట్రక్‌, రోడ్డు రోలర్‌, చపాతి మేకర్ గుర్తుల అభ్యర్థులకు భారీగా ఓట్లు నమోదయ్యాయి. దీంతో పలుచోట్ల ఫలితాలు కూడా తారుమారయ్యాయి.


ఫ్రీ సింబల్స్‌లలో చపాతి మేకర్‌, డోలి, కుట్టు మిషన్, సబ్బు డబ్బా, టీవీ, కెమేరా, పడవ, రోడ్డు రోలర్ వంటివి ఉన్నాయి. వాటిని ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. గతంలో కారును పోలిన గుర్తులతో నకిరేకల్‌, దుబ్బాక ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థుల విజయవకాశాలు తారు మారు అయ్యాయి. అలాగే హుజురాబాద్‌లో కూడా కారు గుర్తు పోలిన గుర్తుకు గణనీయంగా ఓట్లు నమోదయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా యుగ తులసి అభ్యర్థికి కారును పోలిన గుర్తుతో అంచనాకు భిన్నంగా అధిక ఓట్లు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో మరోసారి కారును పోలిన గుర్తులు బీఆరెస్ అభ్యర్థులను భయపెడుతున్నాయి.

Subbu

Subbu

Next Story