బీఎస్పీలో చేరిన సుప్రీమ్ స్వేరో ఆర్ఎస్పీ

విధాత‌:బహుజనులు బానిసలు కాకుండా పాలకులుగా మారాలని తెలంగాణ మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొద్దిరోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన ఆదివారం బహుజన సమాజ్‌ వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రవీణ్‌ కుమార్‌ను తెలంగాణ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు రాంజీ గౌతమ్ ప్రకటించారు. […]

బీఎస్పీలో చేరిన సుప్రీమ్ స్వేరో ఆర్ఎస్పీ

విధాత‌:బహుజనులు బానిసలు కాకుండా పాలకులుగా మారాలని తెలంగాణ మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొద్దిరోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన ఆదివారం బహుజన సమాజ్‌ వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రవీణ్‌ కుమార్‌ను తెలంగాణ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కార్యకర్తలు, స్వేరోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.