తహశీల్దార్ ఇక్బాల్‌పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
వరంగల్ అర్బన్ తహశీల్దార్ ఇక్బాల్‌పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేష్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు.

తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ డిమాండ్
వరంగల్ అర్బన్ తహశీల్దార్ ఇక్బాల్‌పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేష్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. విధి నిర్వాహణలో ఉన్న తహశీల్దార్‌పై దురుసుగా ప్రవర్తించిన వారిపై కేసు చర్యలు తీసుకోవాలని కోరారు.
వరంగల్ అర్బన్ మండల తహశీల్దార్ ఇక్బాల్ మంగళవారం బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వెళ్లారు. దీనిని స్థానికంగా ఉన్న కొందరు నాయకులు పక్క దారి పట్టించి ప్రజలను రెచ్చగొట్టేలా చేశారన్నారు. ప్రజలను పక్కదారి పట్టించి దాడికి యత్నించిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితమై పని చేస్తున్న అధికారులపై ఇలాంటి సంఘటనలు జరుగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. అధికారులపై దాడులు, దాడి యత్నాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.