Journalists | ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.. జర్నలిస్ట్‌ల దశాబ్దాల కల సాకారం

జర్నలిస్ట్ ల దశాబ్దాల కల సాకారం చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం తెలిపింది

Journalists | ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.. జర్నలిస్ట్‌ల దశాబ్దాల కల సాకారం

మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన బీఓడీ సభ్యులు
సీఎం చేతులమీదుగా ఉత్తర్వులు
త్వరలో జరిగే జర్నలిస్ట్ ల సభలో సీఎం చేతుల మీదుగా ఉత్తర్వులు

విధాత: జర్నలిస్ట్ ల దశాబ్దాల కల సాకారం చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం తెలిపింది. ఈ మేరకు జర్నలిస్ట్ లకు పేట్ బషీరాబాద్ స్థలం అప్పగింత ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన సందర్భంగా సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో మీడియా అకాడమీ ఆధ్వర్యం లో తెలంగాణ జర్నలిస్ట్ ల మహా సభ సందర్భం గా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకు ఉత్తర్వులు అందచేస్తారని చెప్పారు.

మిగిలిన జర్నలిస్ట్ లకు సంబంధించి పాలసీ ప్రకటన, చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేయడం వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. త్వరలో నిర్వహించే సభలో పెద్ద ఎత్తున పాల్గొని మన కల సాకారం కావడానికి కారణమైన ముఖ్యమంత్రికి , రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి , మీడియా అకాడమీ చైర్మన్ కు కృతఙ్ఞతలు తెలియచేసుకుందామని సొసైటీ పాలక వర్గ సభ్యులు ఈ సందర్భంగా జర్నలిస్ట్ లకు పిలుపు ఇచ్చారు