Telangana Congress | గోబెల్‌ను మించిపోయిన కేటీఆర్‌.. సుప్రీం తీర్పుపై కామెంట్లపై కాంగ్రెస్ కౌంటర్‌

ఫేక్ ప్రచారాలు చేయడంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోబెల్‌ను మించిపోయాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

Telangana Congress | గోబెల్‌ను మించిపోయిన కేటీఆర్‌.. సుప్రీం తీర్పుపై కామెంట్లపై కాంగ్రెస్ కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : ఫేక్ ప్రచారాలు చేయడంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోబెల్‌ను మించిపోయాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. విద్యుత్తు కమిషన్ చైర్మన్‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సత్యం గెలిచిదంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్ ట్విటర్ వేదికగానే కౌంటర్ వేసింది. కేటీఆర్ గారూ…ఫేక్ ప్రచారాలు చేయడంలో మీరు గోబెల్ ను మించి పోయారని, ఆ విషయంలో మీరు “ఒక వర్గానికి” ఇన్స్పిరేషన్ అని కాంగ్రెస్ విమర్శించింది.

సుప్రీం తీర్పులో అసలు విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచేసి, మీరు “దోచేసిన” దానిపై విచారణ ఖాయం అన్న విషయాన్ని వదిలేసి “అర బుర్ర” అని మిమ్మల్ని ట్రోల్ చేసే వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నారని ఎద్దేవా చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపైన, విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న విషయాన్ని దాచేస్తే ఎట్లా అని కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై కమిషన్‌ విచారణ ఆగదు..నిజం నిగ్గు తేలకుండా ఉండదని స్పష్టం చేసింది.