తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో భిన్న పరిస్థితులను ఎదుర్కొంది. ఘోర ఓటమి నుంచి మెజార్టీ సీట్ల వరకూ ప్రస్థానాన్ని నిలుపుకుంది.

  • ఘోర ఓటమి నుంచి అత్యధిక సీట్లు
  • 1994లో సింగిల్ డిజిట్ కే పరిమితం
  • కొత్త రాష్ట్రం రెండు శాసనసభల్లోనూ బోల్తా
  • మూడో శాసనసభకు సంపూర్ణ మెజార్టీ
  • తాజా ఎన్నికల్లో 64 సీట్లతో మెరుపులు

విధాత: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో భిన్న పరిస్థితులను ఎదుర్కొంది. ఘోర ఓటమి నుంచి మెజార్టీ సీట్ల వరకూ ప్రస్థానాన్ని నిలుపుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అత్యధిక కాలం ప్రభుత్వ పగ్గాలను చేపట్టింది. ఈ క్రమంలో 1983లో కొత్తగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ.. కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆతర్వాత ఏపీ రాష్ట్ర పునర్వ్యస్థీకరణతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ మొదటి, రెండో దఫా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను టీఆరెస్ దెబ్బకొట్టింది.

తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 సీట్లతో.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో రికార్డు సృష్టించింది. కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో ఇదే అతి పెద్ద గెలుపుగా నమోదైంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ భాగంగా ఉన్న‌ప్పుడు, ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు తొలిసారి అతి పెద్ద గెలుపు తాజా ఎన్నిక‌ల్లో ద‌క్కినట్లయ్యింది.జయాలు.. అపజయాల కలబోత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 107 శాసనసభ స్థానాలు ఉండేవి. 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌దే పూర్తి ఆధిప‌త్యం. ఎన్టీఆర్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం త‌ర్వాత దానికి గండి పడింది. ఆఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్, తెలంగాణ ప్రాంతంలోని 107 స్థానాలకు గాను కేవలం 43 సీట్లకే పరిమితమైంది. 1985 ఎన్నికల్లో 14, 1989లో 58, 1994లో 6, 1999లో 42, 2004లో 48 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసుకుంది.

1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని చవిచూసి, కేవలం సింగిల్ టిజిట్ కే పరిమితమైంది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2009లో జరగ్గా, తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాల 119కి చేరుకున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 50 స్థానాలు దక్కించుకుంది. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయింది.ఆ ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే దక్కించుకుంది. గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ ఏడుగురు టీఆరెస్ పంచన చేరగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఆ స్థానాల్లో ఉపఎన్నికకు తెరలేచింది. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమినే చవిచూసింది. ఆ తర్వాత తెలంగాణ రెండో శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కూటమితో బరిలోకి దిగినా బోల్తాపడింది. టీఆర్ఎస్ పార్టీనే పైచేయి సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయాన్ని నమోదుచేసుకుని, ప్రతిపక్షంలో కూర్చుంది. 1983 త‌ర్వాత తొలిసారిగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో 64 మెజారిటీ సీట్లు సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ వరుస ప్రభంజనానికి టీడీపీ దెబ్బ కొట్టగా, నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ.. కాంగ్రెస్ ను రెండు దఫాలుగా దూరం చేసింది. పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన తెలంగాణ కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో తన సత్తాను మరోసారి నిరూపించుకుని, ప్రజల మనసులను గెలిచింది. అధికార పీఠంలో కూర్చుంది.Somu

Somu

Next Story