కార్పోరేషన్ చైర్మన్ల నియామకాల రద్దు
తెలంగాణ ప్రభుత్వం పలు కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలు రద్ధు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది

విధాత : తెలంగాణ ప్రభుత్వం పలు కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలు రద్ధు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హాయంలో నియమించబడిన చైర్మన్ల నియామకాలు దీంతో రద్దయ్యాయి. వారిలో కొంమంది ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కాగా ఇప్పటికే గత ప్రభుత్వం నియమించిన 12మంది సలహాదారుల నియామకాలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా కార్పోరేషన్ల చైర్మన్ల నియామకాలను కూడా రద్దు చేయడం గమనార్హం.