CPM | ఎన్నికల హామీలను అమలు చేయండి … కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సీపీఎం

అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను సత్వరం అమలు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోనిర్వహించిన రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మాణం చేసింది.

CPM | ఎన్నికల హామీలను అమలు చేయండి … కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన  సీపీఎం

విధాత: అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను సత్వరం అమలు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోనిర్వహించిన రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మాణం చేసింది.
ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి మినహా మహిళలకు నెలవారీ పెన్షన్‌ రు.2500, వ్యవసాయ కార్మికులకు రు.12వేలు, కౌలు రైతులకు రైతుభరోసా, రైతుబీమా అమలు చేయడం లేదని తెలిపింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంటల బోనస్‌ అమలు చే యాలని డిమాండ్ చేసింది. ధరణి లోపాలను సవరించాలని కోరింది.

బీజేపీని నిలువరించటమే మా ప్రధాన కర్తవ్యం
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగానూ బీజేపీని నిలువరించటమే తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు సంబంధించి కలిసొచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో ప్రజలు దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హక్కుల కోసం కేంద్రంపై పోరాడాలి…
రేవంత్ సర్కారుకు వీరయ్య సూచన

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, హక్కుల సాధనకు కేంద్రంపై పోరాడాలని సీఎం రేవంత్ కు వీరయ్య సూచించారు. రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ చర్చించటం మంచిదే అనీ, అయితే రెండు రాష్ట్రాలకు సంభంధించి కేంద్రం పరిధిలోని అంశాలపై మోడీ సర్కారు పై ఒత్తిడి తేవాలనే ప్రతిపాదన వారిద్దరికీ లేకపోవటం శోచనీయమని అన్నారు.