హైదరాబాద్లో 6.5కోట్ల నగదు పట్టివేత
హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఆరు కార్లలో తరలిస్తున్న 6.5కోట్ల నగదు అప్పా జంక్షన్ వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుబడింది

విధాత: హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఆరు కార్లలో తరలిస్తున్న 6.5కోట్ల నగదు అప్పా జంక్షన్ వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుబడింది. సూట్ కేసులల్లో ఆ డబ్బు తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. పట్టుబడిన నగదు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నఖమ్మం జిల్లాలోని ఓ మాజీ ఎంపీకి చెందినదిగా అనుమానిస్తున్నారు. పోలీసులు పట్టుబడిన నగదు ఎవరిది..ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు.