ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణస్వీకారం
విధాత: హుజురాబాద్ శాసనసభ్యుడిగా ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి […]

విధాత: హుజురాబాద్ శాసనసభ్యుడిగా ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈటల ప్రమాణ స్వీకారం అనంతరం కొండా విశ్వేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల తెలంగాణ ఉద్యకారుడని చెప్పారు. ఉప ఎన్నికలో ఆయన గెలవడంతో ఉద్యమకారులంతా పార్టీలకతీతంగా సంబుర పడుతున్నారన్నారు. ఉద్యమకారుడికి మద్దతుగా తానూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
