మరోసారి కేటీఆర్ వర్సెస్ రేవంత్ ట్విట్టర్ వార్
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును తలుకుచుకుంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో పెట్టిన పోస్టుపై రేవంత్‌రెడ్డి ఘాటైనా వ్యాఖ్యలతో కౌంటర్

విధాత : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును తలుకుచుకుంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో పెట్టిన పోస్టుపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటైనా వ్యాఖ్యలతో కౌంటర్ వేయగా వారిద్ధరి ట్వీట్టర్ వార్ వైరల్‌గా మారింది. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందంటూ తన కొడుకు హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్టు చేసి ఈ పిల్లాడిని మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్‌పై ప్రతిస్పందించిన రేవంత్‌రెడ్డి కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా..ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీకులా ఉండదనుకున్నావా? అంటూ ప్రశ్నిస్తూ రీట్వీట్ చేశారు. సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక తమ పిల్లలు
ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా? కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక… కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? అంటు రీట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌పై రేవంత్ విరుచకపడ్డారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి…ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. ట్వీట్టర్ వేదిగా మంత్రి కేటీఆర్‌కు, రేవంత్‌కు మధ్య సాగిన వార్ మరోసారి వైరల్‌గా మారింది.