టీఆర్ఎస్.. పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నది: ఎంపీ ఉత్తమ్ ధ్వజం

విధాత, రాష్ట్రంలో పోలీస్ శాఖను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట సబ్ జైలులో ఉన్న కోదాడ మండలం కొమరబండకు చెందిన మాజీ సర్పంచ్ సంపెట రవి గౌడ్‌ను ఉత్తమ్ జైలుకు వెళ్లి పరామర్శించారు. రవిగౌడ్ కు కావాల్సిన న్యాయ సహాయంతో పాటు అతని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలందరితో ఎంపీ ఉత్తమ్ మాట్లాడి, జైలు పరిస్థితులను […]

టీఆర్ఎస్.. పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నది: ఎంపీ ఉత్తమ్ ధ్వజం

విధాత, రాష్ట్రంలో పోలీస్ శాఖను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట సబ్ జైలులో ఉన్న కోదాడ మండలం కొమరబండకు చెందిన మాజీ సర్పంచ్ సంపెట రవి గౌడ్‌ను ఉత్తమ్ జైలుకు వెళ్లి పరామర్శించారు.

రవిగౌడ్ కు కావాల్సిన న్యాయ సహాయంతో పాటు అతని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలందరితో ఎంపీ ఉత్తమ్ మాట్లాడి, జైలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు రవిగౌడ్ పై అక్రమ కేసుల పెట్టి జైలుకు పంపించేలా చేశారన్నారు. తెలంగాణ పోలీసులను ఉపయోగించి కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న సీఎం కేసీఆర్ ఇంకోవైపు ప్రధాని మోదీ సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తున్నారని గొంతు చించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కూలిపోయే ప్రభుత్వాన్ని చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు పోలీసులు బానిసలుగా మారుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి ఎల్లలు దాటుతుందన్నారు.

కేసీఆర్ కుంభకోణాలు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు పాకాయని విమర్శించారు. ప్రజలు అన్ని అన్ని గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు చరమగీతం పాడుతార న్నారు.