విద్యార్థినిని జుట్టుపట్టి లాక్కెళ్తున్న పోలీసులు
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించవద్దని జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని చేస్తున్న నిరసనను

విధాత : వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించవద్దని జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని చేస్తున్న నిరసనను అణిచివేయడంలో పోలీసులు అనుసరించిన వైఖరి విమర్శలకు తావిస్తుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన నిరసనలో పాల్గొన్న విద్యార్థులను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థినిని ఇద్దరు మహిళా పోలీసులు స్కూటిపై వెంటాడుతూ ఆమె జుట్టు పట్టుకుని లాగడంతో ఆమె రోడ్డుపై పడి గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పోలీసుల తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.