అమ్మానాన్న ఆలోచించండి!.. బీఆరెస్‌ను ఓడించండి !!
బీఆరెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నికల్లో బీఆరెస్ ఓటమికి తమవంతు కృషి చేస్తూ అధికార పార్టీని టెన్షన్ పెట్టిస్తుంది.

- తెలంగాణ నిరుద్యోగులు
విధాత: బీఆరెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నికల్లో బీఆరెస్ ఓటమికి తమవంతు కృషి చేస్తూ అధికార పార్టీని టెన్షన్ పెట్టిస్తుంది. అమ్మానాన్న ఆలోచించండి…బీఆరెస్‌ను ఓడించండంట తెలంగాణ నిరుద్యోగులు పేరుతో విడుదల చేసిన కరపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేసీఆర్‌కు ఓటు వేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులను చంపేస్తాడు అన్న టైటిల్‌తో రూపొందించిన కరపత్రంలో బీఆరెస్ పార్టీకి ఓటు వేస్తే చనిపోతున్న నిరుద్యోగుల విద్యార్థుల ఉసురు మనకు మన ఇంట్లో వాళ్లకు తాకుందని..ఆలోచించండి అమ్మానాన్న అంటూ కరపత్రంలో అభ్యర్థించారు.
మీ కొడుకు, కూతురు ఉద్యోగం చేసుకోవాలా ఉరివేసుకోవాలా ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. 50,000 జీతం వచ్చే ఉద్యోగం నీ కొడుకు కూతురికి ఇవ్వకుండా మీకు 2వేల రూపాయల పెన్షన్ ఇస్తూ మిమ్మల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. బీఆరెస్ పార్టీకి ఓటు వేయమని ఒట్టు చేసుకోండని, మీరు 2వేల పెన్షన్ కోసం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా చంపేస్తున్నారని హెచ్చరించారు. కేసీఆర్ కు ఓటు వేసి మీ కొడుకు కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఇంటికి ఒకరు సావండి ఒక్కో శవానికి ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడని ఆరోపించారు.
మీరు మీ కొడుకు, కూతురును ఎంతో కష్టపడి చదివించారని, వారు ప్రయోజకులై మంచి ఉద్యోగం చేయాలని ఎన్నికలలు కన్నారో ఆలోచించండని, ఇలా మీ కొడుకు కూతురు ఇన్ని సంవత్సరాలు చదివి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడానికి మీ ఊరు వదిలి హైదరాబాద్ పోయి ఉద్యోగం వచ్చేవరకు ఊరికి రాకుండా కష్టపడి చదువుకొని ఎంతో ఆశతో పరీక్షలు రాస్తే ఆ ఉద్యోగాలను కేసీఆర్ దొంగతనంగా అమ్ముకుంటే, 18 సార్లు పరీక్షలు రద్దు అయితే మీ పిల్లల పరిస్థితి ఏంది ఉద్యోగం రాలేదని ఉరేసుకొని చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ పిల్లలు చనిపోయేలా చేస్తున్నా ఈ కేసీఆర్ కి మీరు ఓటు వేస్తారా.. ఉద్యోగం చేస్తా అంటున్న నీ కొడుకును సావమంటుండూ ఈ కేసీఆర్ అని, 10 సంవత్సరాలుగా బీఆరెస్ పార్టీ తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల, నిరుద్యోగుల ప్రాణాలు తీస్తుందని, ఇందుకోసం కాదు మనం తెలంగాణ రాష్ట్రం సాధించిందని, నమ్మించి గొంతు కోస్తున్న ఈ కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి.. ఈ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీని ఓడిద్దాం..తెలంగాణ యువత ప్రాణాలు కాపాడుకుందాం అని తెలంగాణ నిరుద్యోగులు తమ కరపత్రంలో పేర్కోన్నారు.
ఇప్పటికే తెలంగాణ పౌర సమాజం జేఏసీ పేరుతో మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, రచయితలు, రిటైర్డ్ ఐఏఎస్‌లతో కూడిన బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇప్పుడు వారికి తోడుగా తెలంగాణ నిరుద్యోగులు పేరుతో సాగుతున్న ప్రచారం సహజంగానే ఎన్నికల ప్రచారంలో బీఆరెస్‌ను కలవర పెడుతుంది.