Medak: కన్నుల పండువగా వసంత పంచమి వేడుకలు

సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చిన్నారులకు అక్షరభ్యాసం..హోమాలు భక్తులతో కిటకిటలాడిన ఆల‌యాలు విధాత, మెదక్ బ్యూరో: జనమేజయుడు సర్పయాగం చేసిన పుణ్యస్థలం అది. గరుడ గంగగా పిలిచే మంజీరా నది ఒడ్డున నిర్మితమైన సరస్పతి మాత ఆలయం. ప్రతి సంవత్సరం వసంత పంచమి (సరస్పతి మాత పుట్టిన రోజు) వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూరు గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు […]

Medak: కన్నుల పండువగా వసంత పంచమి వేడుకలు
  • సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు
  • చిన్నారులకు అక్షరభ్యాసం..హోమాలు
  • భక్తులతో కిటకిటలాడిన ఆల‌యాలు

విధాత, మెదక్ బ్యూరో: జనమేజయుడు సర్పయాగం చేసిన పుణ్యస్థలం అది. గరుడ గంగగా పిలిచే మంజీరా నది ఒడ్డున నిర్మితమైన సరస్పతి మాత ఆలయం. ప్రతి సంవత్సరం వసంత పంచమి (సరస్పతి మాత పుట్టిన రోజు) వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూరు గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు కన్నుల పండువ గా జరుగుతాయి.

గురువారం రోజు వేకువ జామున నుండే భక్తులు మంజీర నదిలో స్నానాలు ఆచరించి సరస్వతి మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ పూజారి దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు హోమాలు నిర్వహిస్తారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసే కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. గురువారం సహితం అక్షరాభ్యాస కార్యక్రమానికి చిన్నారులు అధిక సంఖ్యలో వ‌చ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమo ఆలయ పూజారి నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ పూజ కార్యక్రమాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

ఎడ్లబండ్ల ఊరేగింపు…

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ ఎడ్లబండ్లు తిరిగే కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంటుంది. బండ్లకు రంగు, రంగు చీరెలు… కొబ్బరి మట్టలతో అలంకరణ చేసిన బండ్లకు ఎడ్లను కట్టి ఆలయం చుట్టూ డప్పు చ‌ప్పుల్లతో తిప్పుతారు. అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమంగా చెపుతారు. భక్తుల రద్దీతో సరస్వతి మాత ఆలయం కళకళ లాడింది.

ఇదిలా ఉండగా మెదక్ పట్టణంలో బొరంచమ్మ ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం కార్యక్రమం కూడా నిర్వ‌హించారు.

మెదక్ ఉమ్మడి జిల్లా లోనే పేరుగాంచిన వర్గల్ సరస్వతి మాత ఆలయం భక్తులతో కిటికీడలాడింది. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగాయి. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం అనంత సాగర్ లో వెలిసిన సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఇక్కడ భక్తులు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.